: ప్రత్యేకహోదాపై రాజకీయాలొద్దు...రాష్ట్రమే ముద్దు: కేవీపీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్ధీకరణ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 22న చర్చకు రానున్న ప్రత్యేకహోదా బిల్లు నెగ్గేందుకు అధికారపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే సమయమని ఆయన చెప్పారు. ఈ బిల్లును పాస్ చేసుకోవడంలో ఏపీకి చెందిన ప్రతి ఒక్కనేత భాగస్వామి కావాలని ఆయన సూచించారు. రాష్ట్రప్రయోజనాలు కాపాడుకునేందుకు అంతా కలిసి నడవాల్సిన సమయం ఆసన్నమైందని, రాష్ట్రంలో ఎన్ని విభేదాలు ఉన్నా కేంద్రంతో పోరాడాల్సిన సమయం ఇదని ఆయన చెప్పారు. ఇందుకు అందరూ సహకరిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News