: వైఎస్సార్సీపీకి గుడ్ బై చెబుతున్నానన్న ఎమ్మెల్సీ అప్పారావు


ఏపీలోని వైఎస్సార్సీపీకి మరో దెబ్బ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీకి గుడ్ బై చెబుతున్నానని, త్వరలోనే టీడీపీలో చేరుతున్నానని ఆయన మీడియా ముందు ప్రకటించారు. ఈ నెల 22న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటానని చెప్పారు. కాగా, చంద్రబాబును కలిసేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తన అనుచరులతో వెళ్లేందుకు సుమారు రెండువందల బస్సులను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News