: ఎదురు కాల్పుల్లో పది మంది కోబ్రా కమాండోలు, ముగ్గురు మావోలు మృతి
బీహార్ లో మావోయిస్టులు, సీఆర్పీఎఫ్ కమాండోల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పది మంది సీఆర్పీఎఫ్ కమాండోలు మృత్యువాతపడగా, ముగ్గురు మావోయుస్టులు హతమయ్యారు. భారీ ఎన్ కౌంటర్ వివరాల్లోకి వెళ్తే... గయ సమీపంలోని ఔరంగాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ దళాలకు చెందిన కోబ్రా కమాండో బృందం కూంబింగ్ చేపట్టింది. ఈ క్రమంలో వారికి మావోయిస్టుల బృందం తారసపడింది. వెంటనే ఇరు బృందాలు కాల్పులు ప్రారంభించాయి. అప్పటికే మావోయిస్టులు పెట్టిన మందుపాతర పేలి పది మంది కమాండోలు మృత్యువాతపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులను మట్టుబెట్టిన కమాండోలు ఐదుగురికి తూటాలు తగిలాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన మావోల నుంచి అధునాతన ఆయుధాలు స్వాధీనం చేసుకున్న కమాండోలు, గాయపడిన వారిని గయ ఆసుపత్రికి తరలించారు.