: కూతుర్ని చంపాలని ఇంద్రాణి, పీటర్ కుట్ర చేశారు: సీబీఐ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో కీలక విషయాలను సీబీఐ న్యాయస్థానానికి వెల్లడించింది. తాజాగా బాంబే హైకోర్టులో నిందితుల బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా, తన వాదనలు వినిపించిన సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. పీటర్ ముఖర్జియా, ఇంద్రణి ముఖర్జియాలిద్దరూ షీనా బోరా హత్యకు కుట్రపన్నారని పేర్కొంది. దీనికి కారణం పీటర్ కుమారుడు రాహుల్ ముఖర్జియాతో షీనా ప్రేమలో పడడమేనని, వారిద్దరూ వివాహానికి సిద్ధపడడాన్ని వారిద్దరూ తట్టుకోలేకపోయారని చెప్పింది. ఈ కేసు ఇప్పుడు కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో పీటర్ ముఖర్జియాకి బెయిల్ ఇవ్వడం వల్ల కేసు తప్పుదోవ పట్టే అవకాశముందని సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో బాంబే హైకోర్టు ఈ కేసులో తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది. కాగా, ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్ కారణంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసులో ఇంద్రాణి, ఆమె మాజీ భర్త, ప్రస్తుత భర్త, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జియా డ్రైవర్ అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే.