: రెచ్చగొట్టే వెబ్సైట్లపై చర్యలు తీసుకుంటాం: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
ఉగ్రవాద చర్యలపట్ల వెబ్సైట్ల ద్వారానే అనేక మంది యువత ఆకర్షితులవుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరజ్ రిజిజు అన్నారు. లోక్‌సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. మతోన్మాదాన్ని యువత మెదళ్లలోకి ఎక్కిస్తూ వెబ్సైట్ల ద్వారా అల్‌ఖైదా, ఇస్లామిక్‌స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అటువంటి వెబ్సైట్లను భారత్‌లో కనపడకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాద్రి ఘటనకు కారణం సామాజిక వెబ్సైట్ ద్వారా జరిగిన ప్రచారమేనని ఆయన అన్నారు. సైబర్ నేరాలు కూడా రోజురోజుకీ అధికమైపోతున్నాయని చెప్పారు.