: రియో ఒలింపిక్స్ కు వెళ్లి యోగా మొదలు పెట్టిన భారత ఆర్చరీ టీము!
బ్రెజిల్ వాతావరణానికి అలవాటు పడేందుకు నాలుగు వారాల ముందుగానే ఇండియా నుంచి వెళ్లిన భారత ఆర్చరీ జట్టు మహిళలు, అక్కడ ప్రత్యేక యోగా సాధన మొదలు పెట్టారు. ప్రస్తుత కోచ్ ల పర్యవేక్షణలో యోగాసనాలు వేస్తూ, ఏకాగ్రత, మానసిక దృఢత్వం సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఈ దఫా భారత మహిళా ఆర్చరీ టీములో బొంబేలా దేవి, దీపికా కుమారి, లక్ష్మీరాణిలతో పాటు, పురుషుల జట్టులో ఏకైకుడిగా అతాను దాసు మాత్రమే అర్హత పొందిన సంగతి తెలిసిందే. వీరిలో దీపికా కుమారికి పతకం తెచ్చే సత్తా ఉందని క్రీడాభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐదవ స్థానంలో ఉండటం, గడచిన కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు సాధించడం ఆమెపై ఆశలను పెంచుతోంది.