: హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో 45 మంది పిల్లల అక్రమ తరలింపు ...విశాఖలో దించేసిన ఆర్పీఎఫ్ పోలీసులు
హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తోన్న 45 మంది పిల్లలను ఆర్పీఎఫ్ పోలీసులు ఈరోజు విశాఖపట్నం వద్ద గుర్తించారు. పిల్లలను కోల్‌కతా నుంచి హుబ్లీకి తీసుకెళుతుండగా విశాఖ వద్ద పోలీసులు అడ్డుకొని పిల్లలను రైల్లో నుంచి దింపేశారు. పిల్లలను అపహరించి తీసుకెళుతున్నారా? అన్న కోణంలో పోలీసులు ఈ అంశంపై ఆరా తీస్తున్నారు. పిల్లలను విశాఖలోని రైల్వేస్టేషన్‌లో దింపిన పోలీసులు వారికి ఆహారాన్ని అందించారు. పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.