: తమిళం నేర్చుకుంటున్న హైదరాబాదీ హీరోయిన్
హైదరాబాదీ హీరోయిన్ అదితి రావు హైదరి ప్రస్తుతం తమిళభాష నేర్చుకునే పనిలో బిజీగా ఉంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక చిత్రంలో అదితిరావు నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తమిళ భాష నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఆ చిత్ర యూనిట్ కు చెందిన ఒక సభ్యుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘అదితి చక్కగా తమిళం మాట్లాడేందుకు గాను గడచిన నెల రోజులుగా ఆమెకు గైడెన్స్ ఇస్తున్నాం. చెన్నైలో మణి సార్ ఆమెకు పాఠాలు చెబుతున్నారు. తమిళ పదాలను ఎలా ఉచ్చరించాలి, సందర్భాన్ని బట్టి ఏ స్థాయిలో ఆయా పదాలను పలకాలనే విషయాలను చెబుతున్నారు. ఈ చిత్రంలో ఆమె పాత్రకున్న ప్రాముఖ్యత దృష్ట్యానే మణి సార్ ఇంత కేర్ తీసుకుంటున్నారు’ అని చెప్పాడు.