: అభివృద్ధికి అడ్డుపడుతున్న పనికిమాలిన పార్టీ అది: సీఎం చంద్రబాబు


అభివృద్ధికి అడ్డుపడుతున్న పనికిమాలిన పార్టీ వైఎస్సార్సీపీ అని సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో గోదావరి-కృష్ణా నదుల పవిత్రసంగమం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అభివృద్ధికి అడ్డుపడుతున్న ఆ పార్టీని చూసి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఏడాదిలో ‘పట్టిసీమ’ను పూర్తి చేశామన్నారు. ఈ ఏడాదిలోనే గోదావరి, పెన్నా నదుల అనుసంధానం చేస్తామని బాబు పేర్కొన్నారు. ‘పట్టిసీమ’ అసాధ్యమని కొంతమంది అన్నారని, అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని, ఇప్పుడు వారేమి సమాధానం చెబుతారంటూ పరోక్షంగా వైఎస్సార్సీపీకి బాబు చురకలంటించారు.

  • Loading...

More Telugu News