: చంద్రబాబూ... ఇలాగే ఉంటే 100 దేశాలు తిరిగినా రూపాయి పెట్టుబడి కూడా రాదు: నటుడు శివాజీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలకు ప్రోత్సాహకరమని, అప్పుడే రాష్ట్రానికి భారీ కంపెనీలు వస్తాయి తప్ప, పరిస్థితి ఇలాగే ఉంటే, చంద్రబాబునాయుడు 100 దేశాలను 1000 విమానాలు వేసుకుని తిరిగి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసినా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రూపంలో రాష్ట్రానికి తేలేరని హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు శివాజీ విమర్శించారు. "ప్రత్యేక హోదా కోసం పోరాడి, దాన్ని సాధించుకుంటే 100 కంట్రీల నుంచి కాదు, గ్లోబ్ మొత్తం నుంచి ఒక్కో ఫ్లయిట్ ఏపీకి వస్తుంది. అయ్యా, మాకు కొంత స్థలం ఇవ్వండి. కంపెనీ పెట్టుకుంటామని వస్తారు. ప్రత్యేక హోదాలో అంత దమ్ముంది. ఈ విషయం అందరికీ తెలుసు" అని అన్నారు.