: లేటుగా వచ్చి... ముంబయ్ ఎయిర్‌పోర్టు అధికారులతో గొడవపడిన స‌ల్మాన్ ఖాన్‌


బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముంబ‌యి ఎయిర్‌పోర్టు అధికారులతో గొడ‌వ‌ప‌డ్డాడు. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఆయ‌న ముంబ‌య్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. టికెట్ బుక్ చేసుకున్న స‌ల్మాన్ ఖాన్ విమానం కోసం ఎయిర్‌పోర్టుకి చేరుకోవాల్సిన స‌మ‌యం కంటే 15 నిమిషాలు ఆల‌స్యంగా చేరుకున్నాడు. దాంతో ఎయిర్‌పోర్టు అధికారులు స‌ల్మాన్ ఖాన్‌ని విమానం ఎక్క‌డానికి అనుమ‌తించ‌బోమ‌ని తేల్చిచెప్పారు. దీంతో స‌ల్మాన్ వారితో గొడ‌వ‌పెట్టుకున్నాడు. తాను ఢిల్లీకి అర్జెంటుగా వెళ్లాల‌ని వాదించాడు. అయినా ఎయిర్‌పోర్టు అధికారులు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో చివ‌రికి జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో స‌ల్మాన్‌ ఢిల్లీ వెళ్లారు.

  • Loading...

More Telugu News