: ఆగస్టు 15 సందర్భంగా తిరంగా ఉత్సవాలు ఘనంగా జరపండి: ఎంపీలకు మోదీ పిలుపు
ఆగస్టు 15 సందర్భంగా తిరంగా ఉత్సవాలు జరపాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు పిలుపునిచ్చారు. అన్ని నియోజక వర్గాల్లో ఎంపీలు స్వయంగా పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ 70 ఏళ్ల ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఆయన చెప్పారు. యువతలో దేశభక్తిని నింపాలని, దేశ సేవలో ఎనలేని కృషి చేసిన నాయకుల గురించి వారికి తెలియజెప్పాలని ఆయన అన్నారు. 70 స్లైడ్స్ తయారు చేసి 70 ఏళ్ల స్వాతంత్య్రంపై ప్రజలకు వివరించి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తిరంగా ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహించే బాధ్యతను కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌లకి అప్పగించారు.