: అమెరికాలో రూమ్ మేట్ చేతిలో హత్యకు గురైన హైదరాబాద్ టెక్కీ సంకీర్త్


హైదరాబాద్, కాచిగూడకు చెందిన సాఫ్ట్ వేర్ నిపుణుడు సంకీర్త్, అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. నార్త్ హాస్టిన్ లో ఉంటూ ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సంకీర్త్ ను, రూమ్ లో అతనితో పాటు ఉండే సాయి సందీప్ గౌడ్ హత్య చేసినట్టు తెలుస్తోంది. వీరు గత వారాంతం ఓ పార్టీకి వెళ్లగా, అక్కడ సంకీర్త్, సందీప్ ల మధ్య గొడవ జరిగిందని, దీని కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సాయి సందీప్ ను అదుపులోకి తీసుకున్న ఫెడరల్ పోలీసులు, కేసును విచారిస్తున్నారు. సంకీర్త్ హత్యతో కాచిగూడలోని అతని కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.

  • Loading...

More Telugu News