: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. రానున్న మూడు, నాలుగు రోజుల వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.