: 2019లో తెలంగాణలో గెలవడమే లక్ష్యం!.. టీ టీడీపీని నిర్లక్ష్యం చేయబోనన్న చంద్రబాబు!


తెలంగాణలో టీడీపీని నిర్లక్ష్యం చేయబోనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. నిన్న హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో టీ టీడీపీ ముఖ్యులతో గంట పాటు జరిగిన భేటీ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘2019లో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయండి. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచి తీరాలి. తెలంగాణలో పార్టీని నిలబెట్టేందుకు, పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు పూర్తి మద్దతిస్తా. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మీరెంత చేస్తారో అంత చేయండి. మీ వెనుక నేనున్నా. కుటుంబ సభ్యులతో గడిపేందుకే హైదరాబాదు వచ్చాను. మిమ్మల్ని కూడా కుటుంబ సభ్యులుగానే పరిగణించి మీతో భేటీ నిర్వహిస్తున్నా. ప్రజా సమస్యలపై స్పీడు పెంచండి. ప్రజల్లోకి వెళ్లండి. కేడరే మన బలం. సంస్థాగతంగా బలోపేతం కండి’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News