: పాక్ లో సైనిక తిరుగుబాటు జరిగితే స్వీట్లు పంచుకుంటారు: ఇమ్రాన్ ఖాన్
"ఇక్కడ ఉన్న మీరంతా నాకు చెప్పండి. పాకిస్థాన్ లో సైన్యం తిరుగుబాటు జరిపి అధికారంలోకి వస్తే మీరు ఏం చేస్తారు?" అని ఆ దేశ విపక్ష నేత, మాజీ క్రికెట్ స్టార్ ఇమ్రాన్ ఖాన్ భారీ సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి అడిగారు. ఆపై ప్రజల తరఫున తనే సమాధానం చెబుతూ, "మిఠాయిలు పంచుకుంటారు. పండగ చేసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు" అని అన్నారు. టర్కీలో సైన్యం తిరుగుబాటు చేస్తే, ప్రజలే తిరగబడి అణచివేసిన నేపథ్యంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాక్ లో నవాజ్ షరీఫ్ పాలన తొందర్లోనే ముగుస్తుందని కూడా ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. కాగా, పాక్ లో సైనిక తిరుగుబాట్లు కొత్తేమీ కాదు. 1958 నుంచి 1971 మధ్య, 1977 నుంచి 1988 మధ్య, ఆపై 1999 నుంచి 2008 మధ్య పాక్ లో సైనిక పాలనే సాగిందన్న సంగతి తెలిసిందే.