: బాలీవుడ్ లెజండరీ సింగర్ ముబారక్ బేగం ఇక లేరు


ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయకురాలు ముబారక్ బేగం(80) ఇక లేరు. గతకొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆమె సోమవారం రాత్రి ముంబైలోని తన ఇంట్లో కన్నుమూశారు. రాజస్థాన్‌కు చెందిన ముబారక్ పదేళ్ల వయసులోనే ముంబై వచ్చి స్థిరపడ్డారు. 1955లో ప్రముఖ నటుడు దిలీప్ కుమార్, వైజయంతీమాల కలిసి నటించిన 'దేవదాస్' చిత్రంలో ఆమె పాడిన ‘‘వో నా ఆయేగీ పలట్ కర్’’ పాట ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో పదిలంగా ఉంది. 1950 నుంచి 1970 వరకు వేలాది పాటలు పాడిన ముబారక్ పలు గజల్స్ కూడా ఆలపించారు. 1961లో వచ్చిన ‘హమారీ యాద్ ఆయేగీ’ చిత్రంలో ఆమె పాడిన ‘కభీ తన్హాయే మే హమారీ యాద్ ఆయేగీ’ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్. సినీ రంగంలో దిగ్గజ సంగీత దర్శకులుగా పేరుగాంచిన ఎస్‌డీ బర్మన్, శంకర్ జైకిషన్, ఖయ్యం తదితరులతో కలిసి ఆమె పనిచేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముబారక్‌కు 2011లో మహారాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించింది.

  • Loading...

More Telugu News