: బీజేపీకి రాజీనామా చేసిన సిద్ధూకు కేజ్రీవాల్ 'సెల్యూట్'!


కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని వీడాలంటే, అందుకు ఎంతో ధైర్యం ఉండాలని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. "ఓ సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ తన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రాజీనామా చేశాడు. సిద్ధూ గుండె ధైర్యానికి నా సెల్యూట్" అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. 52 సంవత్సరాల సిద్ధూ, మాజీ ఇండియన్ క్రికెటర్ గా అభిమానులందరికీ సుపరిచితుడు. ఈయన 'ఆప్'లో చేరి పంజాబ్ సీఎం అభ్యర్థిగా వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తారని, అందుకోసమే బీజేపీని వీడారని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో సిద్ధూ, కేజ్రీవాల్ లు కలసి భవిష్యత్ కార్యాచారణపై ఓ నిర్ణయానికి వస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News