: ఇన్ఫోసిస్ టెక్కీ 'స్వాతి' మతం మార్చుకుని ప్రేమించింది... ఆమెది పరువు హత్య!.. సీబీఐ విచారణ జరగాలి!: డీపీఐ నేత సంచలన ఆరోపణలు


గత నెలలో చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్ లో హత్య చేయబడ్డ స్వాతి, మతం మార్చుకుని ప్రేమలో పడిందని, ఆమెది పరువు హత్యని డీపీఐ ప్రధాన కార్యదర్శి తిరుమావళవన్ సంచలన ఆరోపణ చేశారు. ఓ కేసులో విచారణలో భాగంగా బన్రూటి కోర్టులో విచారణకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. రామ్ కుమార్ ఏకపక్ష ప్రేమ హత్యకు కారణం కాదని, రాష్ట్ర పోలీసులు ఎన్నో వాస్తవాలను దాచి పెట్టారని ఆయన ఆరోపించారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపించాలని, ఈ దిశగా నిజానిజాలు వెలుగుచూసేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రేమించి పరువు హత్యలకు గురవుతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.

  • Loading...

More Telugu News