: కడప గడపలో వైఎస్ జగన్ కు ఝలక్!... టీడీపీలో చేరిన 8 మంది వైసీపీ కార్పొరేటర్లు!


ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’... విపక్షం వైసీపీకి షాకుల మీద షాకులిస్తోంది. ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. వీరిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కడప మునిసిపల్ కార్పొరేషన్ లోనూ జగన్ కు భారీ షాక్ తగిలింది. కార్పొరేషన్ లోని వైసీపీ కార్పొరేటర్లలో నిన్న ఒకేసారి 8 మంది టీడీపీలో చేరిపోయారు. నిన్న కడప నుంచి హైదరాబాదు వచ్చిన 8 మంది కార్పొరేటర్లకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో స్వయంగా కండువాలు కప్పి తన పార్టీలోకి ఆహ్వానం పలికారు.

  • Loading...

More Telugu News