: ఆంగ్లంలో టీజీ ప్రమాణం!... సంస్కృతంలో ప్రమాణం చేసిన బీజేపీ నేత!


రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా నిన్న పార్లమెంటు ఎగువ సభలో వైవిధ్యం కనిపించింది. తెలుగు నేల నుంచి రాజ్యసభకు ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ ఆంగ్లంలో ప్రమాణం చేశారు. అదే సమయంలో ఈ దఫా కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆ రాష్ట్ర భాష కన్నడలో ప్రమాణం చేశారు. ఇక వరుసగా మూడు పర్యాయాలు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ దఫా రాజస్థాన్ నుంచి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన నిన్న రాజ్యసభ సభ్యుడిగా హిందీలో ప్రమాణం చేశారు. ఇక బీజేపీకే చెందిన శివప్రతాప్ శుక్లా అందరి కంటే విభిన్నంగా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు.

  • Loading...

More Telugu News