: భారత్- చైనా సరిహద్దులో ‘టిప్పు సుల్తాన్’, ‘మహారాణా ప్రతాప్’ ఔరంగజేబు’.. ఎవరు వీరు?


బ్రిటిష్ వారికి ముచ్చెమటలు పట్టించిన వీరు భారత్-చైనా సరిహద్దులో కాపాలా కాస్తుండడమేమిటి? అని ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే చైనా సరిహద్దు వెంబడి వాస్తవాధీన రేఖ వద్ద భారత్ మోహరించిన యుద్ధ ట్యాంకుల పేర్లు ఇవి. తూర్పు లఢఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వెంబడి రోడ్డు, బంకర్లు నిర్మించుకుంటున్న భారత్ ఆర్మీ దాదాపు వంద యుద్ధ ట్యాంకులను మోహరించింది. వీటిలో మూడు ట్యాంకర్ల పేర్లు టిప్పు సుల్తాన్, మహారాణా ప్రతాప్, ఔరంగజేబు. ఆరు నెలల క్రితమే అధికారులు వీటిని సరిహద్దుకు తరలించారు. 1965లో చైనాతో జరిగిన యుద్ధం భారత్‌కు అవమానాన్ని మిగిల్చింది. ఆ తర్వాత సరిహద్దు వెంబడి ఎటువంటి మోహరింపులు కానీ, నిర్మాణాలు కానీ భారత్ చేపట్టలేదు. మరోవైపు చైనా మాత్రం తన కవ్వింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. సరిహద్దు వెంబడి సైనిక బలగాలను మోహరిస్తూ మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 2012 నుంచి ఇండియన్ ఆర్మీ ఈ ప్రాంతంపై దృష్టి సారించింది. దాదాపు వంద యుద్ధ ట్యాంకులను మోహరించింది. మరికొన్ని రోజుల్లో మరిన్ని ట్యాంకులు చేరుకోనున్నాయి. ‘‘సరిహద్దులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకు తగిన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని లెఫ్టినెంట్ జనరల్ ఎస్‌కే పత్యాల్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో యుద్ధ ట్యాంకులను నిర్వహించడం అంత సులభమైన పనేమీ కాదు. మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రత వాటి పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీంతో ఆర్మీ ప్రత్యేక లూబ్రికెంట్లు ఉపయోగించి వాటి పనితీరు దెబ్బతినకుండా కాపాడుతుంటుంది. ప్రస్తుతం భారత్-చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత్ యుద్ధ ట్యాంకులు మోహరించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

  • Loading...

More Telugu News