: సభకు ఆలస్యంగా వచ్చిన సుజనా!... రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయలేకపోయిన వైనం!


టీడీపీ సీనియర్ నేత, కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడిగా చేయాల్సిన ప్రమాణం మరోమారు వాయిదా పడింది. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటికే చాలా మంది ప్రమాణం చేశారు. నిన్నటి సభా కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ సహా పలువురి చేత రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ప్రమాణం చేయించారు. ఇందులో భాగంగా సుజనా కూడా నిన్ననే ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే నిర్దేశిత సమయానికి కాస్తంత ఆలస్యంగా సుజనా సభకు వచ్చారు. దీంతో ఆయన నిన్న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం తాను ప్రమాణం చేయనున్నట్లు ఆయన రాజ్యసభ చైర్మన్ కు సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News