: ప్రధాని వద్దకు ఒంటరిగా వెళ్లిన కేసీఆర్!... 40 నిమిషాల పాటు ఏకాంత భేటీ!


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి ఒంటరిగా వెళ్లారు. ఆ సమయంలో తన వెంట వచ్చేందుకు యత్నించిన పార్టీ ఎంపీలను ఆయన వద్దని వారించారు. పార్లమెంటులోని ప్రధాని గది వద్దకు ఒంటరిగానే వెళ్లిన కేసీఆర్... మోదీతో దాదాపు 40 నిమిషాల పాటు ఏకాంత చర్చలు జరిపారు. నిన్న ప్రధానితో భేటీకి పార్లమెంటుకు చేరుకున్న కేసీఆర్ కు ఎదురేగి స్వాగతం పలికిన ఎంపీలు... ఆయనతో పాటే ప్రధాని వద్దకు వెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని వారించి ‘‘మిమ్మల్ని వద్దని చెప్పినగా. ఎందుకొచ్చిండ్రు?’’ అని నిలదీశారు. దీంతో మిన్నకుండిపోయిన ఎంపీలు అక్కడే నిలబడిపోయారు. మోదీ గదికి కేసీఆర్ కదలగానే... ఎంపీలంతా సెంట్రల్ హాల్ కు వెళ్లారు. ఇక ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత కేసీఆర్ కూడా సెంట్రల్ హాల్ కు వెళ్లి తన పార్టీ ఎంపీలతో కలిసి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు.

  • Loading...

More Telugu News