: డాక్టర్లను ఇంటికి పంపాలా?... కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని ప్రత్యేక శ్రద్ధ!


అంతర్రాష్ట్ర మండలి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు జ్వరంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఫలితంగా రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో కూడా ఆయన కూర్చోలేకపోయారు. అయితే నిన్న మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన వరుస భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ... కేసీఆర్ ను అత్యంత ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం కుదుటపడ్డాకే హైదరాబాదు వెళ్లాలని, అవసరమైతే ఎయిమ్స్ వైద్యులను కూడా కేసీఆర్ వద్దకు పంపిస్తానని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘అంతా ఓకేనా కేసీఆర్ జీ... ఆరోగ్యం కుదుట పడిందా? రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి రెస్ట్ తీసుకోండి కేసీఆర్ జీ. అవసరమైతే చెప్పండి... ఎయిమ్స్ వైద్యులను పంపిస్తా. మొహమాటపడకండి’’ అని మోదీ కేసీఆర్ తో అన్నారు. మోదీ ఆప్యాయ పలకరింపునకు కేసీఆర్ పులకించిపోయారు. ఈ సందర్భంగా మోదీకి సమాధానమిచ్చిన కేసీఆర్ ‘‘హైదరాబాదు నుంచి ఆయుర్వేద వైద్యుడిని పిలిపించుకుని మందులేసుకున్నాను’’ అని చెప్పారు.

  • Loading...

More Telugu News