: నేడు గురుపౌర్ణిమ!... సాయిబాబా ఆలయాలకు పోటెత్తిన భక్తజనం!
గురుపౌర్ణమి సందర్భంగా నేటి తెల్లవారుజాము నుంచి దేశంలోని సాయిబాబా ఆలయాలు అన్నీ భక్తులతో పోటెత్తాయి. మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా సన్నిధికి వేలాది మంది తరలివచ్చారు. గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబాను దర్శించుకోవాన్న భావనలో తరలివచ్చిన భక్తజనంతో షిరిడీ కిటకిటలాడుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సాయిబాబా ఆలయాలు కూడా భారీగా తరలివచ్చిన భక్తులతో కోలాహలంగా మారాయి. ఆయా ఆలయాలకు తరలివచ్చిన భక్తులు సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీ, దిల్ సుఖ్ నగర్, ఫిల్మ్ నగర్ లలోని సాయిబాబా ఆలయాల్లో భక్తుల క్యూలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.