: చొక్కా రంగు మార్చేసిన కేసీఆర్!... ఢిల్లీలో గోధుమ రంగు షర్ట్ లో కనిపించిన వైనం!


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వేసుకునే చొక్కా రంగు ఏది? అని అడిగితే... ఏమాత్రం తడుముకోకుండా తెలుపు రంగే కదా అంటాం. నిజమే... కేసీఆర్ తెలుపు రంగు చొక్కాలోనే దర్శనమిస్తారు. ఈ రంగు చొక్కా కాకుండా దాదాపుగా ఆయనను చూడలేదు. అయితే అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కేసీఆర్ తన చొక్కా రంగు మార్చేశారు. ఢిల్లీ పర్యటన సాంతం ఆయన తన చొక్కా రంగు మార్చలేదులెండి. నిన్న ఒక్కరోజు మాత్రం ఆయన తన చొక్కా రంగును మార్చేశారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ధరించే గోధుమ రంగు చొక్కా తరహాలో కాస్తంత లైట్ గోధుమ రంగు చొక్కాలో కేసీఆర్ దర్శనమిచ్చారు. ఖద్దరు కాని గోధుమ రంగు గుడ్డతో కుట్టిన సదరు షర్ట్ లో నిన్న తన విడిది నుంచి బయటకు వచ్చిన కేసీఆర్... ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేసీఆర్ తో భేటీ సమయంలో మోదీ కూడా గోధుమ రంగు కుర్తాలోనూ ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News