: పోలీస్ విచారణ కు హాజరైన టీవీ నటి శ్రీవాణి


రంగారెడ్డి జిల్లా పరిగిలో తన వదిన నివాసముంటున్న ఇంటిని కూలగొట్టారనే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ సీరియల్స్ నటి శ్రీవాణి ఈరోజు పోలీస్ విచారణకు హాజరయ్యారు. వికారాబాద్ లోని సీఐ కార్యాలయానికి ఆమె వెళ్లారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, విచారణ నిమిత్తం పోలీసులు రమ్మంటే వచ్చానని, సంతకం చేసి వెళుతున్నానని చెప్పారు. అంతకు మించి ఇంకేమీ లేదని చెప్పిన శ్రీవాణి, పత్రికలు నిజాలే రాస్తాయని, ఛానెల్స్ వాస్తవాలే ప్రసారం చేస్తాయనే నమ్ముతానని, కానీ, కొన్ని అబద్ధాల కథనాలు కూడా వెలువడుతున్నాయంటూ ఆమె వాపోయింది.

  • Loading...

More Telugu News