: నేను నటించగలనని తెలుసు...నటిస్తానో లేదో చెప్పలేను: సానియా మీర్జా
బాలీవుడ్ అంటే ప్రత్యేక ఆసక్తి చూపించే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... సినిమాల్లో నటించగలననే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. తనకు నటించడం తెలుసు అని చెప్పిన సానియా, సినిమాల్లో నటిస్తానో లేదో మాత్రం చెప్పలేనని పేర్కొంది. ముంబైలో తన ఆటోబయోగ్రఫీ (ఏస్ అగైనెస్ట్ ఆడ్స్) ని ఆవిష్కరించిన సందర్భంగా సానియా మాట్లాడుతూ, ఫరాఖాన్ దర్శకత్వంలో నటిస్తానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని చెప్పింది. ఫరాఖాన్, తాను మంచి స్నేహితులమని చెప్పిన సానియా మీర్జా, ఆమె సినిమాలో నటన మాత్రం అవాస్తవమని తేల్చిచెప్పింది. తన ఆటోబయోగ్రఫీని ఫరా కానీ, వేరెవరైనా తెరకెక్కిస్తే ఎవరు నటించాలని ఉంటే వారే నటిస్తారని సానియా తెలిపింది.