: నెలపాటు నైవేద్య విరామ దర్శనాలకు బ్రేక్
వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నెలరోజుల పాటు నైవేద్య విరామ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. గురువారం మినహా మిగతా అన్ని రోజులలో ఇది అమలులో ఉంటుంది. మే 31 వరకూ ఈ నిర్ణయం అమలులో ఉంటుందని టీటీడీ చైర్మన్ బాపిరాజు చెప్పారు. ఎక్కువ మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వీలుగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.