: నటన బోర్ అనిపిస్తే దర్శకత్వం చేస్తా: నిత్యా మీనన్
సినిమాల్లో నటించడం అనేది ఏదో ఒకరోజు బోర్ కొడుతుందని నిత్యా మీనన్ చెప్పింది. ఎప్పుడూ నటించాలంటే ఇబ్బందిగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ఒక్కోసారి 'చాలా విభిన్నమైన పాత్రలు చేశాను, కొత్త తరహా పాత్రలు రావడం లేదు, ఇక నటన ఆపేద్దా'మని అనిపిస్తుంటుందని నిత్యా మీనన్ చెప్పింది. అయితే కొన్ని సినిమాల షూటింగ్ లు నడుస్తుండడం, కొన్ని సబ్జెక్టులు వింటుండడంతో సినిమాల నుంచి ఇప్పుడే తప్పుకునే అవకాశం లేదని చెప్పింది. అయితే ఏదో ఒకరోజు నటన అంటే బోర్ కొడుతుందని, ఒకేపనిని నిరంతరం చేయడం తనకు నచ్చదని తెలిపింది. అలా అనిపించిన రోజున దర్శకురాలిగా మారతానని తెలిపింది. తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పని విధానం నచ్చుతుందని చెప్పిన నిత్య, త్రివిక్రమ్ అసలు టెన్షన్ పడడాన్ని తాను చూళ్లేదని తెలిపింది. చాలా కామ్ గా, కూల్ గా, సరదాగా ఆయన పని చేసుకుపోతారని చెప్పింది. తమిళంలో మణిరత్నం దర్శకత్వం నచ్చుతుందని, ఆయన ప్రతి విషయాన్ని పట్టించుకుంటారని, ఏమాత్రం శాటిస్ ఫై కాకపోయినా మళ్లీ షూట్ అంటారని తెలిపింది.