: నేను తెలుగులో మాట్లాడగలగడానికి కారణం ఇదే!: నిత్యా మీనన్
తాను పుట్టి, పెరిగిందంతా బెంగళూరులోనేనని, అందుకే తనకు మలయాళం కూడా పెద్దగా రాదని, తన తండ్రికి తెలుగు బాగా వచ్చని, తనను 'రారా బంగారం' అని పిలిచేవారని, దాని అర్థం ఏమిటో అప్పట్లో తనకు తెలిసేది కాదని చెప్పింది కథానాయిక నిత్యామీనన్. 'అలా మొదలైంది' సినిమా షూటింగులో ఓ సీన్ లో 'సచ్చినోడా' అనే ఓ డైలాగ్ విన్న తరువాత, అది గమ్మత్తుగా అనిపించి, తెలుగుపై ఫోకస్ పెట్టానని చెప్పింది. బెంగళూరులో ఉంటే తెలుగు కూడా వచ్చేస్తుందని, దానికి కారణాలు అడగొద్దని చెప్పింది. అందుకే తాను తెలుగులో గలగలా మాట్లాడేస్తానని చెప్పింది. బెంగళూరు వెళ్తే...కన్నడకు బదులు తెలుగు మాట్లాడేస్తుంటానని తెలిపింది.