: 'టీజీఐ ఫ్రై డే' బార్ లైసెన్స్ రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ
హైదరాబాదులోని పంజాగుట్ట వద్ద ఫ్లైఓవర్ పై యాక్సిడెంట్ చేసిన ఘటనలో మైనర్లకు మద్యం సరఫరా చేసిన బంజారా హిల్స్ లోని టీజీఐ ఫ్రై డే బార్ లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన అనంతరం ఒక టీవీ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో మైనర్లకు మద్యం సరఫరా చేసినట్టు తేలడంతో, ఆ సాక్ష్యాలను సేకరించిన ఎక్సైజ్ శాఖ మరో మూడు బార్లపై చర్యలకు సిద్ధమవుతోంది. వారి లైసెన్సులు కూడా రద్దు చేస్తామని ప్రకటించింది. దీంతో మద్యం తాగి యాక్సిడెంట్ చేసిన శ్రావెల్ పై చర్యలు తీసుకునేందుకు జేఎన్టీయూ కూడా సిద్ధమవుతోంది. సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం ఆ ఐదుగురు విద్యార్థులపై చర్యలుంటాయని వీసీ తెలిపారు.