: ప్రియాంక ఒక్కరే అద్భుతాలు చేయలేరు: జైరాం రమేష్


ప్రియాంకా గాంధీ ఒక్కరే అద్భుతాలు చేయలేరని, అందరూ కలిసికట్టుగా పని చేస్తే పార్టీని పునర్ నిర్మించడం సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. ప్రియాంకా గాంధీ రాజకీయ రంగప్రవేశం, యూపీ ఎన్నికలపై ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పార్టీ పునర్ నిర్మాణానికి పాటుపడాల్సిన బాధ్యత అందరిమీద ఉందని అన్నారు. వారు చేస్తారు, వీరు చేస్తారు అంటూ చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిన సమయం ఇది కాదని, కలిసికట్టుగా పని చేయాల్సిన సమయమని ఆయన పేర్కొన్నారు. యూపీ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్ ను నిలబెట్టి కాంగ్రెస్ మంచి పని చేసిందని అభిప్రాయపడ్డ ఆయన, అనుభవాల నుంచే తాము నేర్చుకుంటున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News