: సుప్రీం తీర్పుపై సానుకూలంగా స్పందించిన రాజీవ్ శుక్లా
లోధా కమిటీ సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్ తెలుపుతూ సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పుపై బీసీసీఐ సీనియర్ కోశాధికారి, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తాము లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాల్సిన అంశంపైనే నిమగ్నమవుతామని ఆయన చెప్పారు. బీసీసీఐ ప్రక్షాళన కోసం లోధా కమిటి చేసిన సిఫార్సుల్లో ఎన్నో అంశాలు సుప్రీం ఆమోదం పొందాయని ఆయన పేర్కొన్నారు. వాటి అమలుకు ప్రణాళిక వేస్తామని, సమగ్రంగా కార్యాచరణ వేసుకొని ముందుకెళతామని ఆయన చెప్పారు.