: వియత్నాంను ఆందోళనలోకి నెడుతున్న టీనేజీ అమ్మాయిల వ్యవహారం!


వియత్నాంను టీనేజర్ల అబార్షన్లు ఆందోళనలోకి నెడుతున్నాయి. కారణాలు ఏవైనా కానీ యువతరం పక్కదోవపడుతోంది. సంప్రదాయాలు, విలువలను పక్కనపెట్టి తొందరపడుతున్నారని, ఇది భవిష్యత్ తరాలకు మంచిది కాదని పలువురు సంప్రదాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు ఇంత ఆందోళన వ్యక్తం చేయడం వెనుక కారణం ఏంటంటే... ఆ దేశంలో ఏడాదికి సుమారు ఆరు వేల మంది టీనేజి అమ్మాయిలు అబార్షన్లు చేయించుకుంటున్నారని తేలింది. వియత్నాం జనరల్ ఆఫీస్ ఫర్ పాప్యులేషన్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ తెలిపిన వివరాల ప్రకారం... 2015 లో మొత్తం దేశంలో 2.80 లక్షల అబార్షన్లు జరగగా, వాటిల్లో 2 శాతం టీనేజి అమ్మాయిల అబార్షన్లని తేలింది. వాస్తవానికి అబార్షన్ల సంఖ్య తగ్గుతున్నప్పటికీ టీనేజీ యువతుల్లో అబార్షన్లు పెరగడం ప్రమాదకర సంకేతమని వారు పేర్కొన్నారు. అయితే ఇవి అధికారిక లెక్కలేనని చెప్పిన ఆ సంస్థ... తమ గుట్టు రట్టుకాకుండా చాలా మంది యువతులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని, ఈ లెక్కలు తెలియవని, ఇవి తెలిస్తే దేశం షాక్ కు గురయ్యే వాస్తవాలు వెలుగు చూస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇది ప్రమాదకర నడవడికి సంకేతమని, సంప్రదాయాలు, విలువల పట్ల యువత ఎలా వ్యవహరిస్తున్నారో ఇలాంటి అంశాల వల్ల తెలుస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News