: రమ్య తాతయ్య మృత‌దేహాన్ని ఉస్మానియాకు త‌ర‌లించేందుకు అంగీక‌రించిన కుటుంబ సభ్యులు


ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన చిన్నారి ర‌మ్య తాత‌య్య మధుసూదనాచారి కూడా ఈరోజు హైద‌రాబాద్‌లోని య‌శోద ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే. అయితే నిందితుల‌కి క‌ఠిన శిక్ష ప‌డాలంటూ, తమకు న్యాయం చేయాలంటూ చిన్నారి ర‌మ్య‌ కుటుంబ స‌భ్యులు, బంధువులు మ‌ధుసూద‌న్ మృత‌దేహంతో ఆసుప‌త్రి ముందే ఐదు గంటలపాటు ఆందోళ‌న నిర్వ‌హించారు. చివ‌రికి మధుసూదనాచారి మృత‌దేహాన్ని ఉస్మానియా మార్చురీకి త‌ర‌లించేందుకు వారు అంగీక‌రించారు. మంత్రి కేటీఆర్‌తో చ‌ర్చించి ర‌మ్య కుటుంబీకుల స‌మ‌స్య‌ల‌ను తీరుస్తామ‌ని ఏసీపీ హామీ ఇవ్వ‌డంతో వారు మృత‌దేహాన్ని అక్క‌డి నుంచి త‌ర‌లించ‌డానికి అంగీక‌రించారు.

  • Loading...

More Telugu News