: దేవినేని ఉమకి అవగాహన లేదు: శ్రీకాంత్ రెడ్డి
మంత్రి దేవినేని ఉమకి రాయలసీమకు ఎన్ని నీళ్లు కావాలన్న దానిపై అవగాహన లేదని వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కడపలో ఆయన మాట్లాడుతూ, రాయలసీమకు 200 టీఎంసీల నికర జలాలు కావాలని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు దిగువకు నీరు వదిలి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేయడం ద్వారా ప్రాజెక్ట్ లో ఉండాల్సిన కనీస 854 అడుగుల నీటిమట్టం లేకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరెప్పుడిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.