: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సిద్దూ...ఆప్ సీఎం అభ్యర్థి?


పంజాబ్ రాజకీయాల్లో సంచలనం రేపే దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ అడుగులు వేస్తోంది. టీమిండియా క్రికెటర్, బీజేపీ నేత నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూను పార్టీ ఫిరాయించేలా చేసింది. రెండు నెలల క్రితం బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు. దీంతో సిద్ధూను తమ పార్టీ తరఫున పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించేందుకు మార్గం సుగమమైందని తెలుస్తోంది. ఆప్ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్దూను రేపు ప్రకటించనున్నట్టు జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈ నిర్ణయం ద్వారా పంజాబ్ లో అకాలీదళ్ తో అమీతూమీకి సిద్ధమవ్వగా, బీజేపీకి ఇది పెను షాక్ కలిగించనుంది.

  • Loading...

More Telugu News