: వైఎస్సార్సీపీ 'ఐస్ క్రీమ్' లాంటింది...చివరికి మిగలదు: రఘువీరా
వైఎస్సార్సీపీ 'ఐస్ క్రీమ్' లాంటి పార్టీ అని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీపై ఆకర్షణతో ఆ పార్టీలో చేరిన నేతలు ఇప్పుడు చల్లగా జారుకుంటున్నారని, దీంతో ఆ పార్టీ ఐస్ క్రీములా కరిగిపోతోందని అన్నారు. చివరికి ఆ పార్టీలో ఎవరూ మిగలరని ఆయన చెప్పారు. తమ పార్టీ అధికారంలో ఉండగా, ముఖ్యమంత్రి కావాలని భావించిన వ్యక్తుల్లో ప్రథముడు జగన్ అని ఆయన అన్నారు. ఈ నెల 22న తమ పార్టీ నేత కేవీపీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రత్యేకహోదా బిల్లు చర్చకు రానుందని, అప్పుడు అన్ని పార్టీలు మద్దతిస్తాయని భావిస్తున్నానని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.