: క్రికెటర్ ని కాబోయి యాక్టర్ నయ్యా: సల్మాన్ ఖాన్
డాక్టర్ని కాబోయి యాక్టర్ని అయ్యాను... అనేది పాతకాలం నాటి సినిమా నటుల స్టేట్ మెంట్. అయితే, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మాత్రం కాస్త డిఫరెంట్ గా 'క్రికెటర్ ను కాబోయి యాక్టర్ నయ్యా'నని చెబుతున్నాడు. ముంబైలో సానియా మీర్జా ఆటోబయోగ్రఫీ 'ఏస్ అగైనిస్ట్ ఆడ్స్' పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ, చిన్నతనంలో క్రికెట్ బాగా ఆడేవాడనని చెప్పాడు. ఆ విషయాన్ని తమ స్కూల్ కోచ్ నాన్నకు చెప్పడంతో ఆయన తనపై ఆశలు పెంచుకున్నారని తెలిపాడు. దాంతో తనకోసం ప్రత్యేకంగా కోచ్ ను కూడా నియమించారని, తెల్లవారుజామునే కోచింగ్ కు రమ్మని కోచ్ చెప్పేవాడని, రోజూ ఆ సమయంలో నిద్రలేవడం తనకు ఇష్టం ఉండేది కాదని, అందుకే తన తండ్రి మ్యాచ్ చూడడానికి వస్తే, ఆ మ్యాచ్ సరిగ్గా ఆడేవాడిని కాదని, దీంతో తనకు సరిగ్గా ఆట రానప్పటికీ...సలీమ్ ఖాన్ కుమారుడినని కోచ్ బాగా ఆడుతానని చెప్పేవాడని తన తండ్రి భావించారని, దీంతో క్రికెటర్ గా మారమని ఇక డిమాండ్ చెయ్యలేదని సల్మాన్ చెప్పాడు. ఆ విధంగా క్రికెటర్ కాబోయి యాక్టర్ నయ్యానని సల్మాన్ తెలిపాడు.