: క్రికెటర్ కరుణ్ నాయర్ కు తప్పిన ప్రమాదం
టీమిండియా క్రికెటర్, కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పంపానదిలో నిన్న స్నేక్ బోట్ లో ప్రయాణిస్తున్న సమయంలో ఆ పడవ తిరగబడింది. కరుణ్ నాయర్ సహా ఆ పడవలో ప్రయాణిస్తున్న పలువురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఇద్దరు గల్లంతైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శ్రీ పార్థసారథి స్వామి వారి ఆలయంలో జరిగే వాల్లా సద్యా ఉత్సవానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే అక్కడి రెస్యూ సిబ్బంది తక్షణం స్పందించడంతో ఇద్దరు మినహా మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారని ఆర్నామూలా పోలీసులు తెలిపారు. సుమారు 100 మందితో ప్రయాణించడంతోనే ఆ పడవ తల్లకిందులైనట్లు తెలుస్తోంది.