: 'ప్లీజ్ డొనాల్డ్ ట్రంప్, మీ కోసం, అమెరికా కోసం...' అంటూ 6 వేల బ్యాగ్ ల గ్రీన్ టీ ప్యాకెట్లను పంపిన కోల్ కతా సంస్థ


"ప్రియమైన డొనాల్డ్ ట్రంప్, ఇండియా నుంచి నమస్తే. మేము మీకు చాలా చాలా నాచురల్ గ్రీన్ టీ బ్యాగ్స్ పంపుతున్నాం. ఈ టీ శరీరంలోని దుష్టత్వాన్ని హరిస్తుంది. మనసును స్వచ్ఛంగా చేసుకునేందుకు సహకరిస్తుంది. చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎంతో మందిని స్మార్ట్ గా చేసింది. దయచేసి ఈ టీ తాగండి. మీ కోసం, అమెరికా కోసం, ప్రపంచం కోసం..." అంటూ కోల్ కతా కేంద్రంగా పనిచేస్తున్న టీ-ఏ-మీ సంస్థ ఓ వీడియోను, 6 వేల అస్సాం గ్రీన్ టీ బ్యాగ్ లను పంపింది. న్యూయార్క్ లోని ట్రంప్ టవర్స్ ఇవి అందాయని తమకు తెలిసిందని కూడా కంపెనీ ప్రకటించింది. "డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై ప్రపంచమంతా చింతిస్తోంది. మనం అతన్ని ఆపలేము. కనీసం మార్చాలన్నదే మా అభిమతం" అని సంస్థ వెల్లడించింది. తాము పంపిన టీ బ్యాగ్ లు కనీసం నాలుగేళ్ల పాటు సరిపోతాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ షా వ్యాఖ్యానించారు. తాము పంపిన టీని ఆయన వాడతారనే భావిస్తున్నామని అన్నారు. కాగా, తేయాకు ప్యాకెట్లను అందుకోవడంపై ప్రశ్నించినా, ట్రంప్ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్న టీమ్ స్పందించలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News