: నెలలో ఒకరోజు తెలంగాణ రాష్ట్ర టీడీపీ నేతలతో భేటీకి చంద్రబాబు నిర్ణయం
నెలలో ఒకరోజు తెలంగాణ రాష్ట్ర టీడీపీ నేతలతో భేటీకి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను తెలిపారు. ఇరు రాష్ట్రాల సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలపై పోరాడుతూ సంస్థాగతంగా బలపడాలని ఆయన టీడీపీ నేతలకు పిలుపు నిచ్చారు. తెలుగుదేశం పార్టీ అనేక సంక్షోభాలను చూసిందని, ధైర్యంగా వాటిని ఎదుర్కొని నిలబడిందని ఆయన చెప్పారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై అభిమానం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.