: హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం ఉండదు: హైకోర్టుకు తెలిపిన కేసీఆర్ సర్కారు


ఈ సంవత్సరం హుస్సేన్ సాగర్ జలాశయంలో వినాయక నిమజ్జనం ఉండదని కేసీఆర్ సర్కారు హైకోర్టుకు తెలియజేసింది. వినాయక విగ్రహాల నిమజ్జనంపై కోర్టులో విచారణ జరుగగా, నిమజ్జన ప్రక్రియను ప్రత్యేక చెరువుల్లో మాత్రమే చేపడతామని స్పష్టం చేసింది. నిమజ్జనానికి హుసేన్ సాగర్ ను వాడబోమని తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయాలను ఇప్పటికే గుర్తించామని, ఈ మేరకు నిమజ్జనం ఊరేగింపు మార్గాలను ఎక్కడివక్కడ మార్చనున్నామని పేర్కొంది. ప్రత్యేక చెరువులను గుర్తించామని, అక్కడ కూడా నిమజ్జనం తరువాత వ్యర్థాల తొలగింపును శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది.

  • Loading...

More Telugu News