: రేపటికి వాయిదా పడిన లోక్‌స‌భ


ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయిన లోక్‌స‌భ స‌మావేశాలు ఆ తరువాత అర‌గంట‌కే వాయిదాప‌డ్డాయి. ఐదుసార్లు ఎంపీగా ప‌నిచేసిన‌ మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌కు చెందిన‌ దల్పత్‌ సింగ్‌ పరాస్తే మృతిపట్ల లోక్‌సభ ఈరోజు సంతాపం తెలిపింది. అనంతరం స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో రాజ‌కీయ సంక్షోభం త‌లెత్తి ఊహించిన ప‌రిణామాలు చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ అంశాల‌పై గ‌ళం విప్ప‌డానికి కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. కశ్మీర్‌లో చెల‌రేగిన హింస‌పై కూడా ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే అవ‌కాశం ఉంది.

  • Loading...

More Telugu News