: మీరు చంపుతారా? మమ్మల్నే చంపి జైలుకు వెళ్లమంటారా?: నిప్పులు చెరిగిన రమ్య కుటుంబం


తాగుబోతుల వీరంగానికి 18 రోజుల వ్యవధిలో ముగ్గురు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న మధుసూదనాచారి కుటుంబం తీవ్ర ఆగ్రహంతో నిరసనలకు దిగింది. ఈ నెల 1న జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 18 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మధుసూదనాచారి నేడు మృతి చెందగా, వారి కుటుంబం హైదరాబాద్, సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రి ముందు నిరసనకు దిగింది. తమ కుటుంబాన్ని ఇంత అన్యాయం చేసిన నిందితులను పంజాగుట్టలోనే బహిరంగంగా ఉరి తీయాలని రమ్య తండ్రి డిమాండ్ చేశారు. ఆసుపత్రి ముందు బైఠాయించి, తమకు న్యాయం జరిగే వరకూ మృతదేహాన్ని తీసుకుపోబోమని నిరసన తెలుపుతుండటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి రెండు నెలల సమయం ఇస్తున్నామని, ఈ లోగా ఐదుగురు నిందితులనూ ఎన్ కౌంటర్ చేయకుంటే, తామే వారిని చంపి ఎలాంటి శిక్షకైనా సిద్ధపడతామని, తీవ్ర ఆగ్రహావేశాలతో రమ్య బంధువులు నిప్పులు చెరగుతున్నారు. దీంతో పోలీసులు, ఆసుపత్రి వైద్యులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పంజాగుట్ట పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. తమ వద్ద ఏడవటానికి కన్నీళ్లు కూడా లేని పరిస్థితి నెలకొందని, హైదరాబాద్ చరిత్రలోనే ఇటువంటి ఘటన జరగలేదని రమ్య తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు.

  • Loading...

More Telugu News