: ఇండియా కోరికేమీ చేతికందే పండు కాదు: చైనా


అణు సరఫరాదారుల బృందంలో చేరాలన్న భారత కోరిక, చేతిక అందేంత ఎత్తులో ఉన్న పండు వంటిదేమీ కాదని చైనా వ్యాఖ్యానించింది. ఎన్ఎస్జీ సభ్యత్వంపై మరింత చర్చ జరగాల్సి వుందని ఇండియాలో చైనా దౌత్యాధికారి లియూ జిన్ సాంగ్ అభిప్రాయపడ్డారు. చైనా అడ్డుకున్నందునే భారత్ కు సభ్యత్వం దక్కలేదన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. పలు దేశాలు అభ్యంతరాలను వ్యక్తం చేశాయని గుర్తు చేశారు. "కొత్తగా దేశాలను బృందంలోకి తీసుకోవాలంటే ఓ విధానం ఉంది. దాన్ని ఇండియా అనుసరించాలి. చైనా ఏ దేశాన్ని కూడా ఇంతవరకూ వ్యతిరేకించలేదు" అని హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ సైతం తన దేశం పేరు చెప్పి విమర్శలు ఏమీ చేయలేదని, ఒక దేశం అడ్డుకున్నదని మాత్రమే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఇండియా అణు ఇంధనాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తే, తాము స్వాగతిస్తామని, అయితే, కర్బన ఉద్గారాలపై మాత్రం నిబంధనలను విధించుకుని వాటిని గట్టిగా అమలు చేయాలని సూచిస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News