: ఐదుగురు కీలక మంత్రుల సిబ్బందిపై నిఘా పెట్టిన కేసీఆర్!


తన మంత్రివర్గంలోని ఐదుగురు మంత్రుల సిబ్బందిపై కేసీఆర్ నిఘా పెట్టారని ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన ప్రత్యేక కథనం కలకలం రేపింది. వివిధ సమస్యలతో వచ్చే ప్రజలకు చెందిన ఫైళ్లను కదిలించాలంటే, ఈ మంత్రుల వద్ద పనిచేస్తున్న సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు పెరగడంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. మంత్రులు బయట తిరుగుతూ ఉండటం వల్ల ఫైళ్లు క్లియర్ కావడం లేదని, సీఎం పేషీకి వెళ్లాల్సిన ఫైల్స్ ను కదిలించేందుకు సైతం డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసిందని పేర్కొంది. దీంతో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ చూస్తున్న ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ, మేనల్లుడు హరీశ్ రావు చూస్తున్న నీటి పారుదల శాఖ సహా ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, విద్యా మంత్రి కడియం శ్రీహరి పేషీలపై సీఎం ప్రత్యేక నిఘాను పెట్టినట్టు సదరు పత్రిక వెల్లడించింది.

  • Loading...

More Telugu News