: కాశ్మీర్ లో ఎమ్మెల్యేపై నిరసనకారుల దాడి... పరిస్థితి విషమం!
హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ అనంతరం కాశ్మీర్ లోయలో చెలరేగిన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఉదయం పీడీపీ ఎమ్మెల్యే మహ్మద్ ఖలీల్ పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. శ్రీనగర్ వెళుతున్న ఖలీల్ వాహనంపై దాడికి దిగిన కొందరు, ఆయన్ను బయటకు లాగి విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో ఖలీల్ కు తీవ్ర గాయాలు కాగా, సమీపంలోని సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఆయన పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దాడి ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.